Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్: పదకొండవ హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ(హెచ్‌వోటీఏ)కి శుక్రవారం తెరలేచింది. సికింద్రాబాద్ క్లబ్ వేదికగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ టోర్నీని అధికారికంగా ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు జరిగే టోర్నీలో వివిధ కేటగిరీల్లో మొత్తం 337 మంది ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్లేయర్లకు టోర్నీ జరిగే రోజులు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి రూ.2లక్షల ప్రైజ్‌మనీగా నిర్వాహకులు ప్రకటించారు. ప్రారంభ కార్యక్రమంలో హెచ్‌వోటీఏ అధ్యక్షుడు నంద్యాల నరసింహారెడ్డి, సికింద్రాబాద్ క్లబ్ ప్రెసిడెంట్ రఘురామ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు శరత్ చౌదరీ, వెస్ట్రన్ కన్స్ట్రక్షన్స్ ఏపీ సంజరురెడ్డి, అసిఫ్ క్లబ్ ప్రెసిడెంట్ పీవీ రావు, టీఎస్‌టీఏ కార్యదర్శి అశోక్ కుమార్, హెచ్‌వోటీఏ సలహాదారు బాలకిషన్‌రావు, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, టోర్నీ కార్యదర్శి హరికష్ణారెడ్డి, అడ్వకేట్ జేవీ రమణ, చీఫ్ కో ఆర్టినేటర్ వినీత్ తదితరులు పాల్గొన్నారు.