Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ న్యూజిలాండ్ పర్యటన నుంచి వైదొలిగాడు. టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఓటమితో ద్రావిడ్‌తోపాటు కోచింగ్ స్టాఫ్ కూడా ఆ టూర్‌కు వెళ్లబోమని, విశ్రాంతి కోరుతూ బోర్డుకు లేఖ రాసారు. దీంతో నేషనల్ క్రికెట్ అకాడమీ ఆ పర్యటనకు కోచ్‌గా వివిఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఎన్సిఏ లక్ష్మణ్‌ను హెడ్ కోచ్‌గా, హృషికేశ్ కనిత్కర్‌ను(బ్యాటింగ్), సాయిరాజ్ బహుతులే(బౌలింగ్) కోచ్‌లుగా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా భారతజట్టు న్యూజిలాండ్‌తో టి20, వన్డే సిరీస్‌లను ఈనెల 18నుంచి వెల్లింగ్టన్ వేదికగా జరిగే మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా భారతజట్టు మూడేసి టి20, వన్డేల్లో పాల్గొనుంది. వెల్లింగ్టన్ వేదికగా నవంబర్ 18న జరిగే తొలి టి20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఈ పర్యటనకు దూరంగా ఉండాలని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్ ముందే తెలిపిన విషయం తెలిసిందే. హైదరాబాద్ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ టి20 ప్రపంచకప్‌కు ముందు భారతజట్టు జింబాబ్వే, ఐర్లాండ్ పర్యటనలకు వెళ్లగా ఆ టూర్లకు హెడ్ కోచ్‌గా పనిచేసిన అనుభవముంది. దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వివిఎస్ కోచ్‌గా ఉన్నాడు. ఇక న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆడే టీమిండియా టి20 కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వన్డేలకు శిఖర్ ధావన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.