Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ రేసు నుంచి నిష్క్రమించిన టీమ్ ఇండియాపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జట్టుకు బాసటగా నిలిచాడు. ఓటమితో కుంగిన జట్టుకు మద్దతు ప్రకటించాడు. 'ఇంగ్లాండ్ చేతిలో సెమీఫైనల్ పరాజయం నిరుత్సాహకరం. ఆ విషయం నాకు తెలుసు. తొలుత ఆశించిన స్కోరు సాధించలేదనే నిజాన్ని అంగీకరించాలి. ఆడిలైడ్‌లో స్క్వేర్ బౌండరీలు చిన్నవి. అక్కడ 168 పరుగులు చాలా తక్కువ. ఆ ఓటమి నిరుత్సాహకరం. కానీ ఇక్కడ ఓ విషయం మరువకూడదు. ఈ ఫార్మాట్లో భారత్ అగ్ర జట్టు. వరల్డ్ నం.1 నిలువటం రాత్రికి రాత్రి జరిగే పని కాదు. కొంత కాలంగా భారత్ నిలకడగా రాణించింది. ఈ ఒక్క పరాజయంతో భారత జట్టును నిందించలేం. ఆటగాళ్లు సైతం క్రీజులోకి వెళ్లి విఫలమవ్వాలని అనుకోరు కదా. క్రీడల్లో ఇటువంటివి సహజం. ఇటువంటి సమయంలో అందరం కలిసికట్టుగా ఉండాలి' అని సచిన్ టెండూల్కర్ అన్నాడు.