Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విమర్శలకు హార్దిక్ పాండ్య కౌంటర్
వెల్లింగ్టన్ : ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకల్ వాన్ ఓ వ్యాసంలో చేసిన ఘాటు విమర్శలపై భారత టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందించాడు. 'సరిగా ఆడకుంటే జనాలు అభిప్రాయాలు చెబుతారు. అది నేను గౌరవిస్తాను. అందరికి భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయని తెలుసు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతూ, మేము ఎవరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని భావిస్తాను. ఇది ఆట. ఇందులో మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం. అంతిమంగా ఫలితం వస్తుం ది. మేము కొన్ని అంశాల్లో మెరుగవ్వాలి, పొరపాట్లను సరిదిద్దుకుంటామని' పాండ్య అన్నాడు. 2011 వన్డే వరల్డ్‌కప్ అనంతరం భారత జట్టు సాధించింది ఏమీ లేదని, ఆధునిక క్రికెట్లో అత్యంత చెత్తగా రాణిస్తున్న జట్టుగా భారత్‌ను అభివర్ణించాడు మైకల్ వాన్.
సూర్య నం.1: ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్య మూడో స్థానంలో ఉన్నాడు. బౌలర్ల జాబితాలో భారత్ నుంచి ఎవరూ లేరు. జట్టు విభాగంలో భారత్ వరల్డ్ నం.1గా కొనసాగుతోంది.