Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేదికలుగా హైదరాబాద్, బెంగళూర్, కోచి
నవతెలంగాణ, హైదరాబాద్ : దేశవాళీ వాలీబాల్‌కు అంతర్జాతీయ హంగులు అద్దిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ రెండో సీజన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆరంభం కానుంది. ప్రైమ్ వాలీబాల్ తొలి సీజన్‌కు హైదరాబాద్ వేదికగా నిలిచిన సంగతి తెలిసిందే. కరోనా పరిస్థితుల్లో తొలి సీజన్‌ను బబుల్‌లో నిర్వహించగా.. రెండో సీజన్‌ను పూర్తి స్థాయిలో అభిమానుల్లోకి తీసుకొచ్చేందుకు నిర్వాహకులు సన్నాహాకాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 4న ఆరంభం కానున్న రెండో సీజన్‌కు మూడు నగరాలు ఆతిథ్య వేదికలుగా నిలువనున్నాయి. హైదరాబాద్‌తో బెంగళూర్, కోచిలు ఈసారి కొత్తగా ప్రైమ్ వాలీబాల్ జోష్‌ను చూడనున్నాయి. ప్రైమ్ వాలీబాల్‌లో ఎనిమిది ప్రాంఛైజీలు ఉన్నాయి. కాలికట్ హీరోస్, కిచ్చి బ్లూ స్పైకర్స్, అహ్మదాబాద్ డిఫెండర్స్, హైదరాబాద్ బ్లాక్ హాక్స్, చెన్నై బ్లిట్జ్, బెంగళూర్ టార్పెడోస్, ముంబయి మేటియర్స్, కోల్‌కత థండర్బోల్ట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. లీగ్ దశ మ్యాచులు హైదరాబాద్, బెంగళూర్‌లో జరుగనుండగా.. ప్లే ఆఫ్స్, ఫైనల్ కోచిలో జరుగుతాయి.