Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూజిలాండ్‌తో తొలి వన్డే నేడు
- ఉదయం 7.00గం||ల నుంచి డిడి స్పోర్ట్స్‌లో
ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమిండియా.. ఇక వన్డే సిరీస్‌పై కన్నేసింది. శుక్రవారం ఆక్లాండ్ వేదికగా జరిగే తొలి వన్డేలో భారతజట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇదే క్రమంలో న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌కు బెంచ్‌కే పరిమితమైన ఉమ్రన్ మాలిక్, సంజు శాంసన్‌కు వన్డేల్లో చోటు దక్కడం ఖాయం కనబడుతోంది. అదే జరిగితే మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగే తొలి వన్డేలో వీరిద్దరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుండగా.. ఇప్పటినుంచే జట్టులో సుస్థిర స్థానం కోసం యువ క్రికెటర్లు తమ ప్రతిభను చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అలాగే టీమిండియా మేనేజ్మెంట్ యువ ఆటగాళ్ల ప్రదర్శనను నిశితంగా పరీక్షించనుంది. ఉమ్రన్ మాలిక్ 150కి.మీ. వేగంతో బంతులను విసురుతుండగా.. సంజు శాంసన్ ఐపిఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున కెప్టెన్‌కు వ్యవహరించిన అనుభవముంది. అతడు క్రీజ్‌లో నిలదొక్కుకుంటే పరుగుల వరద పారడం ఖాయం. వికెట్ కీపర్, బ్యాటర్ అయిన సంజు నేడు జరిగే వన్డేలో ఏమేరకు రాణిస్తాడో వేచిచూడాల్సి ఉంది. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జరిగిన మూడు టి20ల సిరీస్‌ను భారత్ 1-0తో చేజిక్కించుకోగా.. ఆ ఫార్మాట్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించాడు. వన్డే ఫార్మాట్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్ కాగా.. శుభ్మన్తో కలిసి అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, షమీ తదితర ఆటగాళ్లు వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో వీరిందరికీ బిసిసిఐ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.
జట్లు..
భారత్: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్, సూర్యకుమార్, శ్రేయస్, పంత్, సంజు(వికెట్ కీపర్లు), షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా, శార్దుల్ ఠాకూర్, ఉమ్రన్ మాలిక్, చాహల్, దీపక్ చాహర్, ఆర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), ఫిలిప్స్, మిఛెల్, కాన్వె, ఫిన్ అలెన్(వికెట్ కీపర్), నీషమ్, బ్రాస్‌వెల్, సాంట్నర్, లాథమ్, మిల్నే, ఫెర్గుసన్, హెన్రీ, టిమ్ సౌథీ.