Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఫిఫా ప్రపంచకప్-2022
దోహా: ఫిఫా ప్రపంచకప్-2022 గ్రూప్-హెచ్లో 1930లో తొలిసారి ఫిఫా ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చిన, టైటిల్ ఫేవరెట్ ఉరుగ్వే జట్టును ఆసియా ఖండానికి చెందిన మరోజట్టు దక్షిణ కొరియా నిలువరించగలిగింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఉరుగ్వేకు ఒక్క గోల్ కొట్టే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో డ్రా అయ్యింది. బంతి ఎక్కువ సమయం ఉరుగ్వే చేతిలో ఉన్నా.. దక్షిణాఫ్రికా రక్షణశ్రేణి సమర్ధవంతంగా ఆ దాడులను ఎదుర్కొగలిగింది. ఇరుజట్లలో ఒక్కో ఆటగాడు ఎల్లోకార్డుకు గురవ్వగా.. ఉరుగ్వే 10సార్లు, కొరియా 7సార్లు ప్రత్యర్థుల గోల్‌పోస్ట్‌లపై దాడులకు దిగాయి. ఉరుగ్వే జట్టు రెండో అర్ధభాగం 85వ నిమిషంలో గోల్ చేసే సువర్ణావకాశం లభించినా.. అది నీళ్లపాలైంది. రెండుసార్లు ఫిఫా టైటిల్‌ను గెలిచిన ఉరుగ్వే జట్టు గత సీజన్(2018)లో క్వార్టర్‌ఫైనల్ వరకు చేరింది. ఉరుగ్వే జట్టు 1930, 1950లలో ఫిఫా ప్రపంచకప్ టైటిళ్లను నెగ్గింది. ఈ మ్యాచ్ డ్రా కావడంతో ఇరుజట్లకు ఒక్కో పాయింట్ దక్కాయి.
స్విట్జర్లాండ్ శుభారంభం
గ్రూప్-జి తొలి లీగ్ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ జట్టు శుభారంభం చేసింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ 1-0తో కామరూన్ను ఓడించింది. స్విట్జర్లాండ్ తరఫున ఏకైక గోల్‌ను బ్రీల్ ఎంబోలో(48వ ని.)లో కొట్టాడు. స్విట్జర్లాండ్ 7సార్లు, కామరూన్ 8సార్లు ప్రత్యర్ధి గోల్‌పోస్ట్‌పై దాడులకు దిగగా.. ఇందులో 3సార్లు బెల్జియం 5సార్లు కామరూన్ గోల్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాయి. బెల్జియం జట్టుకు 11సార్లు కార్నర్లు లభించినా ప్రయోజనం లేకపోయింది. 2018లో స్విట్జర్లాండ్ జట్టు ప్రి క్వార్టర్స్‌కు చేరి స్వీడన్ చేతిలో ఓటమిపాలైంది.
చెమటోడ్చి నెగ్గిన బెల్జియం
2018 ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో 3వ స్థానంలో నిలిచిన బెల్జియం జట్టు తన తొలి లీగ్ మ్యాచ్‌లో చెమటోడ్చి నెగ్గింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్-హెచ్లో బెల్జియం 1-0 తేడాతో కెనడాను ఓడించింది. బెల్జియం తరఫున ఏకైక గోల్‌ను తొలి అర్ధభాగం ముగియడానికి ఒక్క నిమిషం ముందు(44వ ని.) మిచీ బాట్టురు కొట్టాడు. ఫిఫా ర్యాంకింగ్స్‌లో స్విట్జర్లాండ్ 15వ స్థానంలో ఉండగా.. కెనడా 41వ ర్యాంక్‌లో ఉంది.
ఫిఫా ప్రపంచకప్‌లో నేడు..
గ్రూప్-బి : వేల్స్ × ఇరాన్(సా.3.30గం||లకు)
గ్రూప్-ఏ : ఖతార్ × సెనెగల్(రా.6.30గం||లకు)
నెదర్లాండ్స్ × ఈక్వెడార్(రా.9.30గం||లకు)
గ్రూప్-బి : ఇంగ్లండ్ × అమెరికా(రా.12.30గం||లకు)