Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాతో ఇంగ్లాండ్ మ్యాచ్ డ్రా
దోహా (ఖతార్) : ఫిఫా ప్రపంచకప్ టైటిల్‌పై కన్నేసి ఖతార్‌కు వచ్చిన ఇంగ్లాండ్ (మూడు సింహాలు).. గ్రూప్-బి తొలి మ్యాచ్‌లో అదరగొట్టింది. ఏకంగా నాలుగు గోల్స్‌తో విశ్వరూపం చూపించింది. కానీ రెండో మ్యాచ్‌లో అమెరికాతో గోల్ లేకుండా డ్రా చేసుకుంది. దూకుడుమీదున్న ఇంగ్లాం డ్కు అమెరికా బ్రేక్ వేసినా.. నాకౌట్ దారిలో ఇంగ్లాండ్ దారులు ఏమీ మూసుకుపోలేదు. గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో వేల్స్‌పై విజయంతో గ్రూప్‌లో అగ్రస్థానంతోనే నాకౌట్‌కు చేరుకునే అవకాశం ఉంది. అమెరికాపై స్పష్టమైన ఫేవరేట్‌గా బరిలో నిలిచిన ఇంగ్లాండ్ గోల్ కోసం ప్రయ త్నాలు చేయటంలో తేలిపోయింది. అమెరికా రక్షణ శ్రేణిని ఛేదించేందుకు ఇంగ్లాండ్ స్ట్రయికర్లు సరికొత్త విన్యాసాలు చేయటంలో తేలిపోయారు. ఇంగ్లాండ్ మూడు సార్లు గోల్ కోసం దాడి చేయగా.. అమెరికా ఓ సారి ఆ ప్రయత్నం చేసింది. బంతిని 56 శాతం నియంత్రణలో ఉంచుకున్న ఇంగ్లాండ్, 87 శాతం పాస్ కచ్చితత్వంతో మెరిసింది. 2022 ప్రపంచకప్ గ్రూప్ దశలోనే మరో మ్యాచ్ గోల్ లేకుండానే డ్రాగా ముగిసింది. ఇంగ్లాండ్, అమెరికాలు చెరో పాయింటు పంచుకున్నాయి.
పోలాండ్ ప్రతాపం
- సౌదీ అరేబియాపై 2-0 విజయం
రెండు సార్లు ప్రపంచ చాంపియన్, అగ్ర జట్టు అర్జెంటీనాను ఓడించి ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద సంచలనం సృష్టించిన సౌదీ అరేబియా..గ్రూప్-సి రెండో మ్యాచ్‌లో చేతులెత్తేసింది. 2-0తో సౌదీ అరేబియాపై పొలాండ్ ఘన విజయం సాధించింది. ఆరంభంలోనే సౌదీ అరేబియా మిడ్ ఫీల్డర్లు చేసిన తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్న పొలాండ్.. గోల్ కొట్టేసింది. 39వ నిమిషంలో రాబర్ట్ లెవాండస్కీ అందించిన పాస్‌ను జెలెన్స్కి గోల్‌గా మలిచాడు. ప్రథమార్థాన్ని 1-0 ఆధిక్యంతో పొలాండ్ ముగిం చింది. ద్వితీయార్థంలో 82వ నిమిషంలో రాబర్ట్ లెవాండస్కీ గోల్ కొట్టి పొలాండ్ ఆధిక్యాన్ని పెంచాడు. నాలుగు ప్రపంచకప్‌లు గోల్ కొట్టని రాబర్ట్ లెవాండస్కీ ఎట్టకేలకు గోల్ నమోదు చేయటంతో భావోద్వేగానికి లోనయ్యాడు. సౌదీ అరేబియాపై విజయంతో గ్రూప్-సిలో పొలాండ్ అగ్రస్థానంలో నిలిచింది. అర్జెంటీనా అట్టడగు స్థానంలో ఉంది. పొలాండ్, మెక్సికోలతో మ్యాచ్‌లో విజయాలు సాధిస్తేనే అర్జెంటీనా నాకౌట్ దశకు చేరుకోగలదు.