Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోస్టారియా చేతిలో ఓటమి
దోహా (ఖతార్) : ఆసియా సింహనాదం జపాన్‌కు చుక్కెదురు. గ్రూప్-ఈ ఆరంభ మ్యాచ్‌లో నాలుగు సార్లు చాంపియన్ జర్మనీపై మెరుపు విజయం సాధించిన జపాన్.. గ్రూప్ దశ రెండో మ్యాచ్‌లో ఆ జోరు కొనసాగించలేదు. కోస్టారియా మెరుపు ప్రదర్శనతో 1-0తో జపాన్ సంచలన విజయం నమోదు చేసింది. కోస్టారియా విజయంతో గ్రూప్-ఈ నాకౌట్ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ప్రథమార్థం గోల్ లేకుండా ముగియగా.. ద్వితీయార్థం 81వ నిమిషంలో కైసర్ ఫుల్లర్ కోస్టారియాకు గెలుపు గోల్ అందించాడు. బంతిని నియంత్రణలో ఉంచుకున్న జపాన్.. గోల్ కోసం కొత్తగా ప్రయత్నించటంలో తేలిపోయింది.