Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓవర్లో ఏడు సిక్సర్లు సహా 43పరుగులు
గుజరాత్: విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌లో రుతురాజ్ గైక్వాడ్ లిస్ట్-ఏ క్రికెట్‌లో నయా చరిత్రను సృష్టించాడు. సోమవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో గుజరాత్ జట్టుపై ఒక ఓవర్లో 7సిక్సర్లతోపాటు ఏకంగా 43పరుగులు రాబట్టి ఈ రికార్డును నెలకొల్పాడు. అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ స్టేడియం 'బి'గ్రౌండ్‌లో జరిగిన క్వార్టర్స్‌లో రుతురాజ్ గైక్వాడ్.. గుజరాత్ స్పిన్నర్ ఎస్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 48వ ఓవర్లో 6,6,6,6,6,6(నోబ్),6 ఇలా వరుసగా 7సిక్సర్లు కొట్టాడు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన మహరాష్ట్ర జట్టు నిర్ణీత 50 ఓవర్లు పూర్తయ్యే సరికి 5వికెట్ల నష్టానికి 330పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. గైక్వాడ్(220నాటౌట్)కి తోడు అజిమ్ కాజీ(37) బ్యాటింగ్‌లో రాణించారు. ఛేదనలో గుజరాత్ జట్టు 47.4ఓవర్లలో 272పరుగులకు ఆలౌటైంది. ఆర్యన్ జూయల్(159) బ్యాటింగ్‌లో రాణించాడు. రాజ్యవర్ధన్‌కు ఐదు, ఖాజీకి రెండు వికెట్లు దక్కాయి. ఇతర క్వార్టర్‌ఫైనల్లో అస్సాం జట్టు 7వికెట్ల తేడాతో జమ్ముకాశ్మీర్‌పై, కర్ణాటక జట్టు 4వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలుపొందగా.. సౌరాష్ట్ర జట్టు 44పరుగుల తేడాతో తమిళనాడుపై విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి.