Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కామరూన్-సెర్బియా మ్యాచ్ డ్రా ొ ఫిఫా ప్రపంచకప్
దోహా : ఫిఫా ప్రపంచకప్-2022లో భాగంగా సోమవారం జరిగిన ఉత్కంఠ పోటీలో దక్షిణ కొరియా జట్టు పోరాడి ఓటమిపాలైంది. ఘనాతో జరిగిన గ్రూప్-హెచ్ మ్యాచ్‌లో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 0-2గోల్స్‌తో వెనుకబడిన కొరియా జట్టు రెండో అర్ధభాగంలో తొలుతే వరుసగా రెండు గోల్స్ కొట్టి 2-2తో సమంగా నిలిచింది. ఆ తర్వాత ఘనా తరఫున మహ్మద్(68వ ని.) మరో గోల్ కొట్టడంతో ఆ జట్టు 3-2తో ఆధిక్యతలో నిలిచింది. ఆ తర్వాత కొరియా జట్టు ఘనా గోల్ పోస్ట్‌పై చివరివరకు దాడులు చేసినా గోల్ చేయలేకపోయింది. దీంతో ఇరుజట్లు మధ్య జరిగిన మ్యాచ్‌లో కొరియా జట్టు 2-3గోల్స్ తేడాతో ఓటమిపాలైంది. కొరియా తరఫున ఛో గే-సంగ్ 58, 61వ ని.లో రెండు గోల్స్ కొట్టాడు. ఇరుజట్లలో ఇద్దరేసి ఆటగాళ్లు ఎల్లో కార్డుకు గురయ్యారు. తొలి లీగ్ మ్యాచ్‌లో కొరియా జట్టు ఉరుగ్వేను 0-0తో డ్రా చేసుకోగా.. ఘనా జట్టు 2-3గోల్స్ తేడాతో పోర్చుగల్ చేతిలో ఓటమిపాలైంది.
కేమరూన్-సెర్బియా మ్యాచ్ డ్రా
గ్రూప్-జిలో కేమరూన్-సెర్బియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయ్యింది. రెండు అర్ధభాగాల సమయం ముగిసే సమయానికి ఇరుజట్లు 3-3గోల్స్‌తో సమంగా నిలిచాయి. కేమరూన్ తరఫున జీన్(29వ ని.), విన్సెంట్(63వ ని.), ఎరిక్(66వ ని) ఒక్కో గోల్ కొట్టారు. ఇక సెర్బియా తరఫున స్ట్రాహింగ్జా(46వ ని.), సెర్జేజ్(48వ ని.), అలెక్సాండర్(53వ ని.) ఒక్కో గోల్ కొట్టారు. ఈ గ్రూప్-లో సెర్బియా జట్టు 0-2గోల్స్ తేడాతో బ్రెజిల్ చేతిలో ఓటమిపాలైతే.. సెనెగల్ జట్టు 3-1గోల్స్ తేడాతో కతార్‌ను ఓడించింది. దీంతో సెనెగల్ జట్టు 4 పాయింట్లతో 2మ్యాచ్‌ల అనంతరం అగ్రస్థానంలో నిలిచింది.
గ్రూప్-ఇలో స్పెయిన్-జర్మనీ జట్ల మధ్య ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ 1-1గోల్స్‌తో డ్రా అయ్యింది. ఈ గ్రూప్ తొలి లీగ్ మ్యాచ్‌లో స్పెయిన్ 7-0తో కోస్టారికాను ఓడిస్తే.. జర్మనీ జట్టు 1-2గోల్స్త తేడాతో జపాన్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్‌లో మాజీ ఛాంపియన్ జర్మనీ జట్టు ప్రి క్వార్టర్స్‌కు చేరాలంటే కోస్టారికాపై భారీ గోల్స్ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది.