Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోటీసు ఇచ్చిన బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్
ముంబయి : బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీకి విరుద్ధ ప్రయోజనాల సెగ తగిలింది. ఇటీవల బీసీసీఐ ఏజీఎంలో అధ్యక్షుడిగా ఎన్నికైన 1983 వరల్డ్‌కప్ విన్నర్ రోజర్ బిన్నీ..డిసెంబర్ 20 లోగా లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాల్సిందిగా బోర్డు ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్ ఆదేశించారు. రోజర్ బిన్నీ కోడలు బీసీసీఐ అధికారిక ప్రసార భాగస్వామి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రజెంటర్. బీసీసీఐ నిబంధన రూల్ 38(1)(ఐ), రూల్ 38(2)లను బిన్నీ ఉల్లంఘిస్తున్నారని సంజరు గుప్తా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎథిక్స్ ఆఫీసర్ బోర్డు అధ్యక్షుడిగా నోటీసులు అందించారు.