Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడా అవార్డుల వేడుకపై ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ : జాతీయ క్రీడా పురస్కారాల ప్రదాన వేడుకపై స్టే విధించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. భారత స్టార్ స్పింటర్ మంజిత్ సింగ్ తనకు అర్జున అవార్డు నిరాకరణను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషను దాఖలు చేశారు. ఈ మేరకు మంగళవారం పిటిషను విచారణకు స్వీకరించిన ధర్మాసనం బుధవారం జరగాల్సిన అవార్డుల ప్రదాన వేడకను నిలుపదల చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ' రేపు జరుగబోయే అవార్డుల ప్రదాన వేడుక నిలుపుదల చేసేందుకు నేను స్టే ఆర్డర్ ఇవ్వటం లేదు. అవార్డుకు అర్హత కలిగినా ఎందుకు జాబితాలో చేర్చలేదో వివరణ కోరేందుకు భారత క్రీడా ప్రాధికార సంస్థం (శారు), కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖలకు నోటీసులు ఇస్తున్నాను' అని జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ ఆదేశించారు.
జకర్తా ఆసియా క్రీడల్లో 800 మీటర్ల పరుగు పందెంలో మంజిత్ సింగ్ బంగారు పతకం సాధించాడు. నిబంధనల ప్రకారం అర్జున అవార్డు అందుకునేందుకు 30 మెరిట్ పాయింట్లు అవసరం. ఆసియా గోల్డ్ మెడల్‌తో మంజిత్‌కు ఆ పాయింట్లు ఉన్నాయి. 25 మెరిట్ పాయింట్లు ఉన్నవారు సైతం అర్జున అవార్డు జాబితాలో ఉండగా, అర్హత కలిగినా పక్కనపెట్టడం అన్యామని మంజిత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. గత నాలుగేండ్లుగా మంజిత్ సింగ్ అర్జున అవార్డు కోసం ధరఖాస్తు చేస్తున్నాడు.