Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్‌తో తొలి టెస్టు ఓ రోజు వాయిదా?
రావల్పిండి (పాకిస్థాన్) :ఇంగ్లాండ్ జట్టు పాకిస్థాన్ పర్యటన ఓ రోజు ఆలస్యం కానుంది. షెడ్యూల్ ప్రకారం ఇంగ్లాండ్, పాకిస్థాన్ తొలి టెస్టు గురువారం రావల్పిండిలో ఆరంభం కావాల్సి ఉంది. కానీ ఇంగ్లాండ్ శిబిరంలో సగానికి పైగా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అనారోగ్యం బారిన పడ్డారు. కోవిడ్-19, కలుషిత ఆహారం ప్రభావం కాదని వైద్య బృందం నిర్ధారించింది. విపరీత వాంతులు, విరేచనాలతో ఇంగ్లాండ్ క్రికెటర్లు బాధపడుతున్నారని సమాచారం. కెప్టెన్ బెన్ స్టోక్స్, సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్‌లు సైతం అనారోగ్యం బారిన పడిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. జో రూట్‌కు సైతం లక్షణాలు కనిపించినా అతడు బుధవారానికి కోలుకున్నాడు. తుది జట్టును బరిలోకి దింపే స్థితిలో లేని పరిస్థితుల్లో తొలి టెస్టు 24 గంటలు వాయిదా వేయటంపై ఈసీబీ మంతనాలు జరుపుతోంది. రావల్పిండి టెస్టును ఓ రోజు వాయిదా వేసేందుకు ఐసీసీ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లాండ్, పాకిస్థాన్ టెస్టు సిరీస్ ఆడుతున్నాయి.