Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లాతో భారత్-ఏ అనధికార టెస్టు
ఢాకా : యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (145, 226 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్స్), అభిమన్యు ఈశ్వరన్ (142, 255 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో చెలరేగారు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 283 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేయటంతో బంగ్లాదేశ్‌తో తొలి అనధికార టెస్టులో భారత్-ఏ 292 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలుత బంగ్లాదేశ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే భారత్-ఏ బౌలర్లు కుప్పకూల్చారు. హైదరాబాదీ యువ సంచలనం తిలక్ వర్మ (26 నాటౌట్, 62 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), ఉపేంద్ర యాదవ్ (27 నాటౌట్, 77 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రెండో రోజు ఆట ముగిసే సమయానికి అజేయంగా ఆడుతున్నారు.