Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2-1తో సౌదీపై మెక్సికో గెలుపు
- గోల్ తేడాతో నాకౌట్ బెర్త్ దూరం
దోహా (ఖతార్) : గ్రూప్-సి నాకౌట్ బెర్త్ రేసు నాటకీయంగా సాగింది. ఓ వైపు అర్జెంటీనాతో పోలాండ్ పోరాడుతుంటే.. మరోవైపు అదే సమయంలో సౌదీ అరేబియాతో మెక్సికో తలపడింది. అర్జెంటీనాతో చేతిలో 0-2తో పరాజయం పాలైనా మెరుగైన గోల్ వ్యత్యాసంతో పోలాండ్ నాకౌట్ దశకు అర్హత సాధించగా.. సౌదీ అరేబియాపై 2-1తో గెలుపొందిన మెక్సికో బుణాత్మక గోల్ వ్యత్యాసంతో నాకౌట్ బెర్త్‌కు దూరమైంది. మార్టిన్, చావెజ్‌లు మెక్సికోకు గోల్స్ కొట్టగా.. అల్ దవసరి సౌదీ అరేబియాకు ఊరట గోల్ అందించాడు.
ఉత్కంఠ గేమ్‌లో..! : ఓ వైపు పోలాండ్‌పై అర్జెంటీనా 2-0తో దూసుకెళ్తోన్న సమయంలో, మరోవైపు మెక్సికో సైతం సౌదీ అరేబియాపై 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఫిఫా ఫెయిర్ ప్లే నిబంధనల ప్రకారం మరో గోల్ కొడితే ఆ జట్టు నాకౌట్‌కు చేరుకునేది. కానీ అదనపు సమయంలో సౌదీ అరేబియాకు ఊరట గోల్ అందించిన అల్ దవసరి మెక్సికో ఆశలపై నీళ్లు చల్లాడు. 95వ నిమిషంలో అల్ దవసరి గోల్ కొట్టి సౌదీ అరేబియా ఓటమి అంతరాన్ని కుదించాడు. ఆట ప్రథమార్థం గోల్ లేకుండా ముగిసింది. ద్వితీయార్థంలో మెక్సికో రెచ్చిపోయింది. 47వ నిమిషంలోనే హెన్రీ మార్టిన్ గోల్ కొట్టాడు. మోంటెస్ అందించిన పాస్‌తో మెక్సికోను ముందంజలో నిలిపాడు. 52వ నిమిషంలో లూయిస్ చావెజ్ మెక్సికోకు మెరుపు గోల్ అందించాడు. మార్టిన్ సాధించిన ఫ్రీ కిక్‌ను తీసుకున్న చావెజ్.. సౌదీ అరేబియా డిఫెన్స్‌ను ఛేదిస్తూ మెరుపు గోల్ నమోదు చేశాడు. దీంతో మెక్సితో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆట చివరి క్షణాల వరకు 2-0 ఆధిక్యంలోనే కొనసాగిన మెక్సికో.. మరో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా ఆధిక్యం తగ్గించుకుంది. అల్ దవసరి గోల్‌తో 2-1 విజయంతో సరిపెట్టుకుంది. విజయం సాధించినా గ్రూప్-సిలో మూడో స్థానంతో నాకౌట్ దశకు అర్హత సాధించలేదు. గ్రూప్-సి ఆరంభ మ్యాచ్‌లో రెండు సార్లు చాంపియన్ అర్జెంటీనాపై 2-1తో సంచలన విజయం నమోదు చేసిన సౌదీ అరేబియా.. ఆ గెలుపు జ్ఞాపకాలతో 2022 ఫిఫా ప్రపంచకప్ పోరాటానికి తెరదించింది.