Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెర్బియాపై 3-2తో గెలుపు
దోహా (ఖతార్) : సెర్బియా వరుసగా నాల్గో ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్ దశను దాటలేదు. ఈ సారి ఏకంగా గ్రూప్ దశలో ఒక్క విజయం నమోదు చేయకుండా నిష్క్రమించింది సెర్బియా. గ్రూప్-జి చివరి మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌పై గోల్స్ కొట్టినా.. విజయానికి అవి సరిపోలేదు. ప్రథమార్థం 2-2తో సమంగా ముగియగా.. ద్వితీయార్థంలో స్విస్ గెలుపు గోల్‌తో ముందంజ వేసింది. సెర్బియా తరఫున అలెగ్జాండర్ (26వ నిమిషం), డుసాన్ (35వ నిమిషం) గోల్స్ కొట్టారు. స్విస్‌కు షకిరి (20వ నిమిషం), బ్రీల్ (44వ నిమిషం), రెమో (48వ నిమిషం) గోల్స్ నమోదు చేశారు. ప్రీ క్వార్టర్స్‌లో బలమైన పోర్చుగల్‌తో స్విట్జర్లాండ్ పోటీపడనుంది.