Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత
మీర్పూర్ : బంగ్లాదేశ్‌తో తొలి వన్డేను చేజార్చుకున్న టీమ్ ఇండియా..మ్యాచ్ ఫీజుల్లో సైతం కోతకు గురైంది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ స్లో ఓవర్‌రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో 80 శాతం కోల్పోయింది. ఐసీసీ నిబంధన ఆర్టికల్ 2.22 ప్రకారం ప్రతి ఓవర్‌కు 20 శాతం కోత విధిస్తారు. భారత్ నాలుగు ఓవర్లు వెనుకంజలో ఉందని మ్యాచ్ రిఫరీ తేల్చారు. దీంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత విధించారు. మ్యాచ్ రిఫరీ చర్యను భారత కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించారు. దీంతో ఈ అంశంలో ఎటువంటి విచారణ ఉండబోదని ఐసీసీ తెలిపింది. బంగ్లాదేశ్‌తో భారత్ రెండో వన్డే బుధవారం మీర్పూర్లోనే జరుగనుంది. సిరీస్‌లో 0-1 వెనుకంజలో నిలిచిన భారత్ సిరీస్‌పై ఆశలు నిలుపుకునేందుకు కచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ స్వదేశానికి పయనంగా కాగా, గాయంతో అక్షర్ పటేల్ తొలి వన్డేకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా క్రికెట్ ఆడుతున్న పంత్.. ఎన్సీఏలో రిహాబిలిటేషన్ పూర్తి చేసుకుని తొలి టెస్టు (డిసెంబర్ 14) సమయానికి జట్టుతో చేరనున్నట్టు సమాచారం.