Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపికైన భద్రాచలం అమ్మాయి
- స్టాండ్‌బైగా యశశ్రీకి సైతం చోటు
హైదరాబాద్ : తెలంగాణ యువ సంచలనం, భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష భారత అండర్-19 ప్రపంచకప్ జట్టుకు ఎంపికైంది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి దక్షిణాఫ్రికా వేదికగా తొలి ఐసీసీ అమ్మాయిల అండర్-19 ప్రపంచకప్ జరుగనుంది. వరల్డ్‌కప్ ముంగిట దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తో టీమ్ ఇండియా త్రైపాక్షిక సిరీస్ ఆడనుంది. త్రైపాక్షిక సిరీస్‌తో పాటు అండర్-19 ప్రపంచకప్‌కు భారత జట్లను ఆల్ ఇండియా ఉమెన్ సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో భారత అండర్-19 ఐదు మ్యాచుల సిరీస్‌లో ఆడుతున్న గొంగడి త్రిష.. బ్యాటింగ్ లైనప్‌లో కీలక బ్యాటర్‌గా వరల్డ్‌కప్ జట్టులో చోటు సాధించింది. మరో తెలుగమ్మాయి యశశ్రీ స్టాండ్‌బై క్రికెటర్‌గా నిలిచింది. సీనియర్ టీమ్ డ్యాషింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ కెప్టెన్‌గా ఎంపికవగా, శ్వేత షెరావత్ వైస్ కెప్టెన్సీ దక్కించుకుంది. మరో సీరియర్ క్రికెటర్, వికెట్ కీపర్ రిచా ఘోష్ సైతం అండర్-19 ప్రపంచకప్‌లో ఆడనుంది.
భారత అండర్-19 జట్టు : షెఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేత షెరావత్ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), గొంగడి త్రిష, సౌమ్య తివారి, సోనియా మెంధియ, హర్లే గాలా, హర్షిత బసు (వికెట్ కీపర్), సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, పర్షవి చోప్రా, టిటాస్ సధు, ఫలాక్ నాజ్, షబ్నమ్. (స్టాండ్‌బై : శిఖా, నజ్లా, యశశ్రీ).