Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్విట్జర్లాండ్‌పై 6-1తో పోర్చుగల్ గెలుపు
- ముగిసిన ప్రి క్వార్టర్స్ పోటీలు
- ఫిఫా ప్రపంచకప్
దోహా: ఫిఫా ప్రపంచకప్-2022 ప్రి క్వార్టర్ఫైనల్లో పోర్చుగల్ జట్టు ఘన విజయం సాధించింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ప్రి క్వార్టర్స్ ఆఖరి మ్యాచ్‌లో పోర్చుగల్ జట్టు 6-1గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్‌ను ఓడించింది. పోర్చుగల్ తరఫున రామోస్ హ్యాట్రిక్ గోల్స్ కొట్టగా.. పెపె(33వ ని.), రాఫెల్(55వ ని.), లియో(90+2వ ని.) ఒక్కో గోల్ కొట్టారు. ఇక స్విట్జర్లాండ్ తరఫున ఏకైక గోల్‌ను మాన్యుయోల్(58వ ని.)లో చేశాడు. పోర్చుగల్ జట్టు తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 2-0 ఆధిక్యతలో నిలవగా.. రెండో అర్ధభాగంలో ఏకంగా నాలుగు గోల్స్ కొట్టింది. ఈ మ్యాచ్‌కు పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో బెంచ్‌కే పరిమితం కావడం విశేషం.
క్వార్టర్స్ బెర్త్‌లు ఖరారు..
పోర్చుగల్-స్విట్జర్లాండ్ జట్ల మధ్య మంగళవారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌తో ప్రి క్వార్టర్స్ పోటీలు ముగిసాయి. 3వ తేదీ శనివారంతో గ్రూప్ దశ లీగ్ పోటీలు ముగియగా.. 6న పోర్చుగల్-స్విట్జర్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్రి క్వార్టర్స్ పోటీలు ముగిసాయి. ప్రి క్వార్టర్స్‌కు మొత్తం 16జట్లు అర్హత సాధించగా.. ఇందులో 2జట్లు ఆసియా ఖండాని చెందిన జట్లు ఉన్నాయి. జపాన్ జట్టు పెనాల్టీ షూటౌట్లో క్రొయేషియా చేతిలో, దక్షిణ కొరియా జట్టు బ్రెజిల్ చేతిలో 4-1తో ఓటమిని చవిచూశాడు. శుక్రవారంనుంచి క్వార్టర్‌ఫైనల్ పోటీలు ప్రారంభం కానున్నాయి.