Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెహిదీ హసన్ సెంచరీ,
- రోహిత్, కేఎల్ రాహుల్, అక్షర్ అర్ధసెంచరీలు
- వన్డే సిరీస్ బంగ్లాదేశ్ కైవసం
ఢాకా : రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమిపాలైంది. 272 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా ఐదు పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. బొటనవేలి గాయంతో చివర్లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ వీరోచిత పోరాటం చేసినా.. మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. రోహిత్ శర్మ 28బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో నిలిచాడు. టీమిండియా విజయానికి 6బంతుల్లో 20 పరుగులు చేయాల్సి దశలో.. ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఆ ఓవర్లో రోహిత్ శర్మ 2ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి ఆశలు కల్పించాడు. చివరి బంతికి సిక్స్ కొడితే విజయం దక్కుతుందనగా, ముస్తాఫిజుర్ యార్కర్ వేయడంతో రోహిత్ శర్మ భారీ షాట్ కొట్టేందుకు సాధ్యపడలేదు. దాంతో టీమిండియా స్కోరు 266 పరుగుల వద్ద నిలిచిపోయింది. తొలుత రోహిత్ శర్మ గాయపడడంతో విరాట్ కోహ్లీ(5) ఓపెనర్‌గా బరిలో దిగాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్(8) సైతం విఫలం కావడంతో టీమిండియా 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. సుందర్ 11, కేఎల్ రాహుల్ 14 పరుగులకే వెనుదిరగడంతో టీమిండియాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. శ్రేయస్ అయ్యర్ 6ఫోర్లు, 3సిక్సర్లతో 82పరుగులు చేశాడు. అక్షర్ పటేల్(56) అర్ధసెంచరీతో రాణించాడు. తొలుత బంగ్లాదేశ్‌కూ శుభారంభం దక్కలేదు. జట్టు స్కోర్ 69పరుగులకు చేరుకొనే సరికే 6వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో తొలి వన్డే హీరో మెహిదీ హసన్ (100నాటౌట్) సెంచరీకి తోడు, మహ్మదుల్లా(77) 7వ వికెట్‌కు 148పరుగులు జతచేశారు. దీంతో ఆ జట్టు భారీస్కోర్‌ను నమోదు చేయగల్గింది. సుందర్‌కు మూడు, శార్దూల్, ఉమ్రన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.
రోహిత్ శర్మకు గాయం
బంగ్లాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతడి బొటన వేలికి గాయమైంది. అనంతరం మెడికల్ టీం అతడిని స్కానింగ్ కోసం ఆస్పత్రికి తరలించింది. అతడి స్థానంలో మైదానంలోకి రజత్ పటిదార్ వచ్చాడు. బంగ్లా ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. సిరాజ్ వేసిన నాలుగో బంతికి అనముల్ భారీ షాట్ ఆడాడు. సెకండ్ స్లిప్‌లో ఉన్న రోహిత్ దాన్ని క్యాచ్ పట్టేందుకు ప్రయత్నిస్తుండగా అతడి బొటన వేలికి తీవ్ర గాయమైంది.
స్కోర్‌బోర్డు..
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: అనుముల్ (ఎల్బి) సిరాజ్ 11, లింటన్ దాస్ (బి)సిరాజ్ 7, షాంటో (బి)ఉమ్రన్ మాలిక్ 21, షకీబ్ (సి)ధావన్ (బి)సుందర్ 8, ముష్ఫికర్ రహీమ్ (సి)ధావన్ (బి)సుందర్ 12, మహ్మదుల్లా (సి)కేఎల్ రాహుల్ (బి)ఉమ్రన్ మాలిక్ 77, అఫిప్ హొసైన్ (బి)సుందర్ 0, మెహిదీ హసన్ (నాటౌట్) 1000, నసూమ్ అహ్మద్ (నాటౌట్) 18, అదనం 17. (50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 271పరుగులు.
వికెట్ల పతనం: 1/11, 2/39, 3/52, 4/66, 5/69, 6/69, 7/217,
బౌలింగ్: దీపక్ చాహర్ 3-0-12-0, సిరాజ్ 10-0-73-2, శార్దూల్ 10-1-47-0, ఉమ్రన్ మాలిక్ 10-2-58-2, సుందర్ 10-0-37-3, అక్షర్ 7-0-40-0
ఇండియా ఇన్నింగ్స్: కోహ్లి (బి)ఇబాదత్ 5, ధావన్ (సి)మెహిదీ (బి)ముస్తఫిజుర్ 8, శ్రేయస్ (సి)అఫిప్ (బి)మెహిదీ 82, సుందర్ (సి)లింటన్ దాస్ (బి)షకీబ్ 11, కేఎల్ రాహుల్ (ఎల్బి) మెహిదీ 14, అక్షర్ (సి)షకీబ్ (బి)ఇబాదత్ 7, దీపక్ చాహర్ (సి)షాంటో (బి)ఇబాదత్ 11, రోహిత్ శర్మ (నాటౌట్) 51, మహ్మద్ సిరాజ్ (బి)మహ్మదుల్లా 2, ఉమ్రన్ మాలిక్ (నాటౌట్) 0, అదనం 19. (50 ఓవర్లకు 9వికెట్ల నష్టానికి) 266పరుగులు.
వికెట్ల పతనం: 1/7, 2/13, 3/39, 4/64, 5/172, 6/189, 7/207, 8/213, 9/252.
బౌలింగ్: మెహిదీ 6.1-0-46-2, ఇబాదత్ 10-0-45-3, ముస్తఫిజుర్ 10-1- 43-1, నసూమ్ అహ్మద్ 10-0-54-0, షకీబ్ 10-1-39-2, మహ్మదుల్లా 3.5-0-33-1.