Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వదేశీ సీజన్ షెడ్యూల్ విడుదల
ముంబయి : కొత్త ఏడాది స్వదేశీ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. నూతన ఏడాదిలో తొలి మూడు నెలలు మూడు దేశాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఐపీఎల్‌కు ముందు ఆస్ట్రేలియాతో వన్డే, టీ20, టెస్టు సిరీస్ ఆడనున్న భారత్.. జనవరి మూడో వారంలో న్యూజిలాండ్‌తో వైట్‌బాల్ సిరీస్ ఆడనుంది. జనవరి తొలి వారంలో శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. భారత్, న్యూజిలాండ్ తొలి వన్డేకు హైదరాబాద్ వేదిక కానుంది. జనవరి 18న హైదరాబాద్ వన్డేతో కివీస్ పర్యటన షురూ కానుంది. శ్రీలంకతో టీ20లకు ముంబయి, పుణె, రాజ్‌కోట్.. వన్డేలకు గువహటి, కోల్‌కత, తిరువనంతపురం ఆతిథ్య ఇవ్వనున్నాయి. న్యూజిలాండ్ వన్డేలకు హైదరాబాద్, రారుపూర్, ఇండోర్.. టీ20లకు రాంచీ, లక్నో, అహ్మదాబాద్ వేదిక కానున్నాయి. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌కు నాగ్‌పూర్, న్యూఢిల్లీ, ధర్మశాల, అహ్మదాబాద్ వేదిక కాగా.. వన్డేలకు ముంబయి, విశాఖపట్నం (మార్చి 19), చెన్నై ఆతిథ్యం ఇవ్వనున్నాయి.