Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్స్
నవతెలంగాణ-హైదరాబాద్
ఫార్ములా రేసుకు మరోసారి హైదరాబాద్ ముస్తాబైంది. ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) స్ట్రీట్ సర్క్యూట్ ఫైనల్స్ నేటి నుంచి ఆరంభం కానున్నాయి. మూడు రౌండ్ల పాటు జరిగే తుది రేస్‌లో శనివారం ఒక రేసు జరుగనుంది. ఆదివారం చివరి రెండు రేసులు నిర్వహించనున్నారు. హుస్సేన్‌సాగర్ తీరంలో 2.7 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్ ఫార్ములా రేసు కోసం సిద్ధమైంది. నవంబర్ 20న హైదరాబాద్‌లో జరగాల్సిన తొలి రౌండ్ పోటీలు రద్దు కావటంతో.. ఫైనల్స్‌కు ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా ఏర్పాట్లు చేశారు.
ముందంజలో బ్లాక్‌బర్డ్స్ : చెన్నైలో జరిగిన రెండు అంచెల పోటీల అనంతరం హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ముందంజలో కొనసాగుతోంది. ఆరు రేసుల్లో ఏకంగా నాలుగింట అగ్రస్థానంలో నిలిచిన హైదరాబాద్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌కు చేరువగా ఉంది. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ 206.5 పాయింట్లతో టాప్‌లో నిలువగా.. గాడ్స్పీడ్ కోచి 161.5 పాయింట్లుతో రెండో స్థానంలో నిలిచింది.