Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షూటౌట్లో బ్రెజిల్ అవుట్
- సెమీఫైనల్లో క్రోయేషియా
- ఫిఫా ప్రపంచకప్ 2022
నవతెలంగాణ-దోహా
ఐదుసార్లు చాంపియన్‌కు షాక్. నెరుమార్ (105వ నిమిషం) గోల్‌తో సెమీఫైనల్లో అడుగేసినట్టే ఆనందపడిన బ్రెజిల్‌కు క్రోయేషియా పెనాల్టీతో చెక్ పెట్టింది. ఉత్కంఠ పెనాల్టీ షూటౌట్లో 4-2తో గెలుపొందిన క్రోయేషియా వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 90 నిమిషాల ఆట అనంతరం బ్రెజిల్, క్రోయేషియా 0-0తో సమవుజ్జీగా నిలిచాయి. 30 నిమిషాల అదనపు సమయంలో ఇరు జట్లు గోల్ కొట్టడంతో ఫలితాన్ని పెనాల్టీ షూటౌట్‌తో తేల్చారు.
బ్రెజిల్ గుండె పగిలింది! : టైటిల్ ఫేవరేట్ బ్రెజిల్ అనూహ్య పరాజయం. 90 నిమిషాల ఆటలోనే పలు గోల్ అవకాశాలను సృష్టించుకున్న బ్రెజిల్ ఆశించిన దూకుడు చూపలేదు. అదనపు సమయంలో నెరుమార్ అద్భుత సోలో గోల్‌తో బ్రెజిల్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరో 15 నిమిషాల ఆట మిగిలి ఉండగా క్రోయేషియా నుంచి ఎవరూ గోల్ అంచనా వేయలేదు. 116వ నిమిషంలో బ్రూనో పెట్కోవిక్ మెరుపు గోల్‌తో బ్రెజిల్‌కు షాక్ ఇచ్చాడు. అదనపు సమయంలో మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇక పెనాల్టీ షూటౌట్లో బ్రెజిల్ గోల్‌కీపర్ నిరాశపరిచాడు. స్ట్రయిట్ కిక్‌లను సైతం అడ్డుకోలేక తేలిపోయాడు. నికోల, మేజర్, లూకా మోద్రిచ్, మిస్లావ్లు క్రోయేషియాకు పెనాల్టీ గోల్ కొట్టారు. బ్రెజిల్ తరఫున కాస్పోరో, పెడ్రోలు మాత్రమే గోల్ కొట్టగా.. రొడ్రిగో, మార్కిన్హోస్లు తడబడ్డారు. ఐదో పెనాల్టీ అవసరం లేకుండా క్రోయేషియా సెమీఫైనల్లోకి చేరుకుంది. గత ఐదు ప్రపంచకప్‌లలో క్వార్టర్స్‌లోనే ఓడటం బ్రెజిల్‌కు ఇదే ప్రథమం.