Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్
నవతెలంగాణ, హైదరాబాద్ : ఆధునిక క్రికెట్లో వ్యక్తిగత అభిరుచి, ఆటశైలికి తోడు ఆహార్యానికి అనుగుణంగా కిట్లు ఉండాలని క్రికెటర్లు కోరుకుంటున్నారు. కోరుకున్న రీతిలో బ్యాట్లను తయారు చేయటంలో క్రిక్ఫ్యూజ్కు మంచి పేరుంది. యువ క్రికెటర్లకు క్రిక్ఫ్యూజ్తో వ్యక్తిగత కిట్ల సమస్యల తీరతాయని బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. ఏఎంబీ శరత్ సిటీ మాల్లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మల్టీ బ్రాండెడ్ క్రికెట్ ఉపకరణాల సంస్థ క్రిక్‌ఫ్యూజ్ అవుట్‌లెట్‌ను ఎమ్మెస్కే ప్రసాద్ ప్రారంభించారు. క్రిక్‌ఫ్యూజ్ రూపొందించిన వాలెన్సా బ్యాట్‌ను ఆవిష్కరించిన ఎమ్మెస్కే ప్రపంచ శ్రేణి ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 'నేను క్రికెట్ ఆడే సమయంలో వ్యక్తిగత అభిరుచికి తగినట్టు ప్రత్యేకంగా బ్యాట్ తయారు చేసే పరిస్థితి లేదు. క్రిక్ఫ్యూజ్తో వర్థమాన క్రికెటర్లకు ఆ సమస్య ఉండదని' ప్రసాద్ అన్నారు. నాణ్యమైన క్రికెట్ ఉపకరణాలను అందుబాటులోకి తీసుకురావటమే క్రిక్‌ఫ్యూజ్ లక్ష్యమని సంస్థ చీఫ్ విన్నకోట అనంత తెలిపారు. క్రిక్‌ఫ్యూజ్ సీఈవో శైలేశ్ నారాయణ్, నిశాంత గుప్త తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.