Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రాక్ ఎక్కని ఐఆర్ఎల్ పోటీలు
నవతెలంగాణ, హైదరాబాద్ : ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) స్ట్రీట్సర్క్యూట్ పోటీలు మళ్లీ నిరాశే మిగిల్చాయి. గత నెలలో ట్రాక్ ఎక్కకుండానే రద్దుగా ముగిసిన ఈవెంట్, తాజాగా అదే చేదు అనుభవం మిగిల్చింది. ట్రాక్‌పై సరైన సన్నద్ధత లేకపోవటం, వాతావరణం అనుకూలంగా లేకపోవటం వంటి కారణాలతో శనివారం జరగాల్సిన తొలి రౌండ్ పోటీలు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నాం 3 గంటల తర్వాత ట్రాక్‌పైకి వచ్చిన కార్లు ప్రాక్టీస్ రేసులో కాసేపు అలరించాయి. కానీ షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన అర్హత రౌండ్ పోటీలు నిర్వహించలేదు. నేడు ఉదయం, మధ్యాహ్నాం సెషన్లలో స్ప్రింట్, ఫీచర్ రేసులను నిర్వహించనున్నట్టు ఐఆర్ఎల్ తెలిపింది. రేసు ఊసులేని రేసింగ్ ఈవెంట్‌కు చూసేందుకు అభిమానులు సైతం పెద్దగా ఆసక్తి చూపించలేదు. అధికశాతం గ్యాలరీలు ఖాళీగా కనిపించాయి.