Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రన్నరప్‌గా హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్
- ముగిసిన ఐఆర్ఎల్ స్రీట్సర్క్యూట్
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) 2022 తొలి సీజన్ చాంపియన్‌షిప్‌ను గాడ్స్పీడ్ కోచి నిలిచింది. మద్రాస్‌లో రెండు అంచెల్లో జరిగిన ఆరు రౌండ్ల పోటీల్లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ఏకంగా నాలుగు రేసుల్లో టాప్ చేసి టైటిల్ రేసులో నిలిచిన సంగతి తెలిసిందే. కానీ ఆదివారం మూడు రేసుల అనంతరం 417.5 పాయింట్లతో కోచి అగ్రస్థానంలో నిలువగా, 385 పాయింట్లతో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రెండో స్థానానికి పరిమితమైంది. హుస్సేన్‌సాగర్ తీరంలో 2.7 కిలోమీటర్ల స్ట్రీట్సర్క్యూట్ రేసు ట్రాక్‌పై జరిగిన మూడు రేసుల్లో మెరుపు వేగంతో దూసుకెళ్లిన కోచి డ్రైవర్లు టీమ్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నారు. ఆదివారం జరిగిన స్ప్రింట్ 1, 2 రేసుల్లో కోచి డ్రైవర్లు నిఖిల్ బోరా, ఆలిస్టర్ యాంగ్‌లు పోల్ పొజిషన్లు సాధించారు. ఫీచర్ రేసులో (ప్రతి జట్టు నుంచి ఇద్దరు డ్రైవర్లు ఉంటారు) కోచి తరఫున నిఖిల్ బోరా, అలిస్టర్ యాంగ్‌లు పోల్ పొజిషన్ దక్కించుకున్నారు. చెన్నై టర్బోరైడర్స్ డ్రైవర్ సందీప్ కుమార్ ఫీచర్ రేసులో పోల్ పొజిషన్ సాధించినా.. టైమ్ పెనాల్టీతో గాడ్స్పీడ్ కోచి డ్రైవర్లు పోల్ పొజిషన్లో నిలిచారు. గోవా ఏసెస్ (282), చెన్నై టర్బోరైడర్స్ (279), బెంగళూర్ స్పీడ్‌స్టర్స్ (147.5), స్పీడ్డెమాన్స్ ఢిల్లీ (141) తర్వాతి స్థానాలు సాధించాయి. ఇండియన్ రేసింగ్ లీగ్ ముగింపు పోటీలకు సినీ తారలు రామ్‌చరణ్ దంపతులు, అక్కినేని నాగచైతన్య ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చారు.