Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ 278/6
చిట్టగాంగ్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్స్ ఛటేశ్వర పుజరా, శ్రేయస్ అయ్యర్ రాణించారు. వీరిద్దరికి తోడు వికెట్ కీపర్ రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ తోడవ్వడంతో టీమిండియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 278పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్(22), శుభ్‌మన్ గిల్(20) తొలి వికెట్‌కు 41పరుగులు మాత్రమే జతచేశారు. ఆ తర్వాత సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి(1) కూడా నిరాశపరచడంతో భారతజట్టు 48పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో టెస్ట్ బ్యాటర్ ఛటేశ్వర పుజరా(90), రిషబ్ పంత్ కలిసి 64పరుగులు జతచేసి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఆ తర్వాత పంత్(46; 45బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. పంత్ నిష్క్రమణ అనంతరం శ్రేయస్-పుజరా కలిసి 5వ వికెట్‌కు 149పరుగులు జతచేశారు. ఈ క్రమంలో సెంచరీకి చేరువలో పుజరా ఔటయ్యాడు. చివర్లో అక్షర్ పటేల్ కూడా పెవీలియన్‌కు చేరడంతో టీమిండియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 278పరుగులు చేసింది. క్రీజ్‌లో శ్రేయస్(82) ఉన్నాడు. తైజుల్ ఇస్లామ్‌కు మూడు, మెహిదీ హసన్‌కు రెండు వికెట్లు దక్కాయి.
స్కోర్‌బోర్డు...
ఇండియా తొలి ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (బి)ఖలీద్ అహ్మద్ 22, శుభ్‌మన్ గిల్ (సి)యాసిర్ అలీ (బి)తైజుల్ ఇస్లామ్ 20, పుజరా (బి)తైజుల్ ఇస్లామ్ 90, విరాట్ కోహ్లి (ఎల్బి) తైజుల్ ఇస్లామ్ 1, రిషబ్ పంత్ (సి)మెహిదీ హసన్ 46, శ్రేయస్ అయ్యర్ (బ్యాటింగ్) 82, అక్షర్ పటేల్ (ఎల్బి)మెహిదీ హసన్ 14, అదనం 3. (90 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 278పరుగులు.
వికెట్ల పతనం: 1/41, 2/45, 3/48, 4/112, 5/261. 6/278
బౌలింగ్: ఇబాదత్ 17-1-63-0, ఖలీద్ అహ్మద్ 12-2-26-1, షకీబ్ 12-4-26-0, తైజుల్ ఇస్లామ్ 30-8-84-3, మెహిదీ హసన్ 18-4-71-2, యాసిర్ అలీ 1-0-7-0