Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చైనామన్ కుల్దీప్ యాదవ్ (4/33), హైదరాబాదీ పేస్‌గన్ మహ్మద్ సిరాజ్ (3/14) స్పిన్, సీమ్‌తో బంగ్లాదేశ్‌పై విరుచుకుపడ్డారు. సిరాజ్ టాప్ ఆర్డర్‌ను కకావికలం చేయగా, కుల్దీప్ యాదవ్ మిడిల్ ఆర్డర్‌ను మాయ చేశాడు. ఈ ఇద్దరి వికెట్ల వేటతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 133/8తో ఫాలోఆన్ ప్రమాదంలో పడింది. అశ్విన్ (58), కుల్దీప్ (40) బ్యాటింగ్ విన్యాసాలతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగుల భారీ స్కోరు సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 271 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది.
- స్పిన్, సీమ్‌తో బంగ్లా కుదేల్
- బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 133/8
- భారత్ తొలి ఇన్నింగ్స్ 404/10
నవతెలంగాణ-చిట్టగాంగ్
భారత్‌తో తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఎదురీదుతోంది. మహ్మద్ సిరాజ్ (3/14) నిప్పులు చెరిగే ప్రదర్శనకు కుల్దీప్ యాదవ్ (4/33) మాయజాలం తోడైంది. సిరాజ్, కుల్దీప్ జోరుతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే 8 వికెట్లు చేజార్చుకుంది. ఫాలోఆన్ ప్రమాదంలో పడింది. షకిబ్ (3), నజ్ముల్ (0), యాసిర్ అలీ (4), తైజుల్ (0) సహా జాకీర్ (20), లిటన్ దాస్ (24), ముష్ఫీకర్ (28) బ్యాట్లెత్తేశారు. 44 ఓవర్లలో 133 పరుగులు చేసిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి మరో 271 పరుగుల వెనుకం జలో నిలిచింది. అంతక ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. టెయిలెం డర్లు అశ్విన్ (58, 113 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుల్దీప్ యాదవ్(40, 114 బంతుల్లో 5 ఫోర్లు) 87 పరుగుల భాగస్వామ్యంతో భారత్‌కు భారీ స్కోరు అందించారు.
సిరాజ్, కుల్దీప్ అదుర్స్
పేసర్ సిరాజ్, స్పిన్నర్ కుల్దీప్ భారత్‌ను తిరుగు లేని స్థితిలో నిలబెట్టారు. ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కూల్చిన మహ్మద్ సిరాజ్.. భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. అవుట్‌సైడ్ ఆఫ్ లెంగ్త్‌తో బంతులేసిన సిరాజ్ బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్‌తో ఆడుకున్నాడు. నజ్ముల్ శాంటో (0), జాకిర్ హసన్ (20) సిరాజ్ బంతులకు సమాధానం ఇవ్వలేకపో యారు. గాల్లో యాంగిల్ మారుతూ సీమ్ అయిన బంతులు పిచింగ్ తర్వాత నేరుగా దూసుకెళ్లాయి. దీంతో బంగ్లా బ్యాటర్లు ఆడలేకపోయారు. లిటన్ దాస్ (24) సైతం సిరాజ్ బంతిని ఆడగలననే నమ్మకంతో బ్యాట్‌ను ఉంచినా.. అది దూసుకెళ్లి వికెట్లను గిరాటేసింది. సిరాజ్ దెబ్బకు 39/3తో కష్టాల్లో కూరుకున్న బంగ్లాదేశ్ మళ్లీ కోలుకోలేదు. మూడో స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్.. పునరాగమనంలో గొప్ప ప్రదర్శన చేశాడు. సంధించిన రెండో బంతికే షకిబ్ (3)ను స్లిప్స్‌లో అవుట్ చేసిన కుల్దీప్.. ఇక ఆగలేదు. వరుస ఓవర్లలో బంగ్లాదేశ్ బ్యాటర్లను పెవిలి యన్‌కు చేర్చాడు. నురుల్ (16), ముష్ఫీకర్ (28), తైజుల్ (0)లు కుల్దీప్ మాయలో పడ్డారు. 102/8 తో ఉన్న బంగ్లా దేశ్ రెండో రోజే కుప్ప కూలేలా కనిపిం చింది. మిరాకిల్ మ్యాన్ మిరాజ్ (16 నాటౌట్), ఎబా డాట్ హోస్సేన్ (13 నాటౌట్) మరో వికెట్ పడ కుండా బంగ్లాదేశ్ ఇన్నిం గ్స్‌ను మూడో రోజుకు తీసుకెళ్లారు!.
అశ్విన్, కుల్దీప్ సూపర్
ఓవర్‌నైట్ స్కోరు 278/6తో రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ 400 ప్లస్ స్కోరు ఆశించ టలేదు. శ్రేయస్ అయ్యర్ (86)ఓవర్‌నైట్ స్కోరుకు ఒక్క పరుగూ జత చేయకుండానే నిష్క్ర మించాడు. ఈ పరిస్థితుల్లో జతకట్టిన అశ్విన్ (58), కుల్దీప్ యాదవ్ (40) ఎనిమిదో వికెట్‌కు విలువైన భాగస్వామ్యం నమోదు చేశారు. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో అశ్విన్ 91 బంతుల్లో కెరీర్ 20వ అర్థ సెంచరీ సాధించగా.. ఐదు ఫోర్ల సాయంతో కుల్దీప్ యాదవ్ 40 పరుగులు పిండు కున్నాడు. ఈ జోడీ మెరుపులతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 400 పైచిలుకు పరుగులు రాబ ట్టింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ (4/133), మిరాజ్ (4/112) నాలుగు వికెట్ల ప్రదర్శనతో మెరిశారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : రాహుల్ (బి) ఖలీద్ 22, గిల్ (సి) అలీ (బి) తైజుల్ 20, పుజారా (బి) తైజుల్ 90, కోహ్లి (ఎల్బీ) తైజుల్ 1, పంత్ (బి) మిరాజ్ 46, శ్రేయస్ (బి) హోస్సేన్ 86, అక్షర్ (ఎల్బీ) మిరాజ్ 14, అశ్విన్ (స్టంప్డ్) నురుల్ (బి) మిరాజ్ 58, కుల్దీప్ (ఎల్బీ) తైజుల్ 40, ఉమేశ్ నాటౌట్ 15, సిరాజ్ (బి) ముష్ఫీకర్ (బి) మిరాజ్ 8, ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం :(133.5 ఓవర్లలో ఆలౌట్) 404.
వికెట్ల పతనం : 1-41, 2-45, 3-48, 4-112, 5-261, 6-278, 7-293, 8-385, 9-393, 10-404.
బౌలింగ్ : హోస్సేన్ 21-2-70-1, ఖలీద్ 20-3-43-1, షకిబ్ 12-4-26-0, తైజుల్ 46-10-133-4, మిరాజ్ 31.5-6-112-4, అలీ 1-0-7-0, నజ్ముల్ 2-0-7-0.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ : నజ్ముల్ (సి) పంత్ (బి) సిరాజ్ 0, జాకీర్ (సి) పంత్ (బి) సిరాజ్ 20, అలీ (బి) ఉమేశ్ 4, లిటన్ (బి) సిరాజ్ 24, ముష్ఫీకర్ (ఎల్బీ) కుల్దీప్ 28, షకిబ్ (సి) కోహ్లి (బి) కుల్దీప్ 3, నురుల్ (సి) గిల్ (బి) కుల్దీప్ 16, మెహిది నాటౌట్ 16, తైజుల్ (బి) కుల్దీప్ 0, హోస్సేన్ నాటౌట్ 13, ఎక్స్‌ట్రాలు : 9, మొత్తం :(44 ఓవర్లలో 8 వికెట్లకు) 133.
వికెట్ల పతనం : 1-0, 2-5, 3-39, 4-56, 5-75, 6-97, 7-102, 8-102.
బౌలింగ్ : సిరాజ్ 9-1-14-3, ఉమేశ్ 8-1-33-1, అశ్విన్ 10-1-34-0, కుల్దీప్ 10-3-33-4, అక్షర్ 7-3-10-0.