Authorization
Mon March 31, 2025 09:33:36 am
హైదరాబాద్: భారత స్టార్ షూటర్ ఇషా సింగ్‌ను రిక్వెల్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఘనంగా సన్మానించింది. రిక్వెల్ఫోర్డ్ స్కూల్ 11వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ వేదికల్లో సత్తా చాటుతున్న తమ విద్యార్థిని ఇషా సింగ్‌ను యాజమాన్యం అభినందించింది. ప్రపంచకప్‌లో ఇషా సింగ్ 4 పతకాలు సాధించటం స్కూల్‌కు గర్వకారణమని రిక్వెల్ఫోర్డ్ వ్యవస్థాపక చైర్మన్ ఎం.ఉదరు కుమార్ అన్నారు. కేంబ్రిడ్జ్ అవుట్‌స్టాండింగ్ లెర్నర్ అవార్డు అందుకున్న జి. అన్షును సైతం ఘనంగా సత్కరించారు. ఆర్ఈఎస్ఐ డైరెక్టర్ అజరు మిశ్రా, విద్యాశాఖ మాజీ ప్రిన్సిపల్ సెక్రటర్ణీరీ ఎస్. చెల్లాప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.