Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీఫైనల్లో ఫౌల్ పట్ల నిరసన
దోహా (ఖతార్): ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేరిన తొలి ఆఫ్రికా, అరబ్ జట్టుగా చరిత్ర పుటలు తిరగరాసిన మొరాకో.. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో పోరులో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 0-2తో సెమీఫైనల్లో పరాజయం చవిచూసిన మొరాకో.. మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌కు ముందు సెమీఫైనల్ మ్యాచ్ రిఫరీపై ఫిఫాకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. మొరాకో ఆటగాడు సోఫినె బౌఫాల్ను అడ్డుకున్న ఫ్రాన్స్ ఆటగాడు థియో హెర్నాండేజ్.. తనే రిఫరీకి ఫిర్యాదు చేశాడు. దీంతో మెక్సికన్ రిఫరీ సీసర్ రామోస్ సోఫినెను బుక్ చేశాడు. కానీ ఇక్కడ నిజానికి మొరాకోకు ఫ్రీ కిక్ ప్రకటించాలి. మ్యాచ్ రిఫరీ, వీఏఆర్ (వీడియో అసిస్టెంట్ రిఫరీ) రెండు సందర్భాల్లో జోక్యం చేసుకోలేదు. అందుకు మొరాకో రెండు పెనాల్టీలను కోల్పోయింది. ఇదే విషయాన్ని యూరోపియన్ మాజీ ఆటగాళ్లు, సాకర్ నిపుణులు బాహాటంగానే విమర్శించారు. నిపుణుల వ్యాఖ్యానాలను ఉటంకిస్తూ ఫిఫాకు మొరాకో ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఫిర్యాదు చేసింది.