Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సఫారీలపై ఆసీస్ గెలుపు
- గబ్బా పిచ్‌పై తీవ్ర విమర్శలు
బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా) : పచ్చిక మైదానం తరహా గబ్బా పిచ్‌పై ఆతిథ్య ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. టెస్టు క్రికెట్ ఆడేందుకు ఏమాత్రం సురక్షితం కాని బ్రిస్బేన్ పిచ్‌పై సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గార్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. కంగారూ సారథి పాట్ కమిన్స్ పిచ్ బాగానే ఉందంటూ వెనకేసుకొచ్చాడు. రెండు రోజుల్లోనే ముగిసిన సూపర్‌ఫాస్ట్ టెస్టులో తొలుత దక్షిణాఫ్రికా 152 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులు చేసి విలువైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగులకు కుప్పకూలింది. 34 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్యాటింగ్‌కు నరకప్రాయమైన పిచ్‌పై ఆసీస్ బ్యాటర్ ట్రావిశ్ హెడ్ (92) విలువైన ఇన్నింగ్స్‌తో ఆతిథ్య జట్టును విజయ పథంలో నడిపించాడు. రెండు రోజుల్లో ముగిసిన టెస్టులో ట్రావిశ్ హెడ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.