Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరాచీ (పాకిస్థాన్) : పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్ ఆధిపత్యం కొనసాగుతోంది. 2-0తో టెస్టు సిరీస్ విజయం కైవసం చేసుకున్న బెన్‌స్టోక్స్ గ్యాంగ్.. కరాచీలో క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. తొలుత పాకిస్థాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులకు కట్టడి చేసిన ఇంగ్లాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో విలువైన ఆధిక్యం దక్కించుకుంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (111, 150 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీకి తోడు బెన్ ఫోక్స్ (64, 121 బంతుల్లో 6 ఫోర్లు), ఒలీ పోప్ (51, 64 బంతుల్లో 4 ఫోర్లు) అర్థ సెంచరీలతో రాణించటంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగులు చేసింది. రెండో రోజు చివరి సెషన్లో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన పాకిస్థాన్ 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (14), షాన్ మసూద్ (3) అజేయంగా ఆడుతున్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌కు మరో 29 పరుగుల వెనుకంజలో నిలిచిన పాకిస్థాన్ నేడు నిలిచి భారీ స్కోరు సాధిస్తేనే క్లీన్‌స్వీప్ ప్రమాదం నుంచి బయటపడవచ్చు!. లేదంటే, ఇంగ్లాండ్‌కు మరో విజయం లాంఛనమే కానుంది!. మూడో రోజు నుంచి పిచ్ బ్యాటింగ్‌కు కాస్త అనుకూలించటం ఆతిథ్య పాకిస్థాన్‌కు ఊరట కలిగించే అంశం.
స్కోరు వివరాలు :
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ : 304/10
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 354/10
పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ : 21/0