Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడుతో రంజీట్రోఫీ మ్యాచ్
చెన్నై: తమిళనాడుతో జరుగుతున్న రంజీట్రోఫీ ఎలైట్ గ్రూప్-బిలో ఆంధ్రప్రదేశ్ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 5వికెట్లు నష్టపోయి 277పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్(85), రికీ బురు(68), కరణ్ షిండే(55) అర్ధసెంచరీలతో రాణించారు. కెప్టెన్ హనుమ విహారి(21), వికెట్ కీపర్ గిరినాథ్(3) నిరాశపరిచారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి షిండేతోపాటు కెవి శశికాంత్(4) క్రీజ్‌లో ఉన్నారు. సాయి కిషోర్‌కు రెండు, సందీప్, అజిత్, విజరుకు తలా ఒక్కో వికెట్ దక్కాయి. తొలి మ్యాచ్‌లో ఆంధ్రజట్టు 9 వికెట్ల తేడాతో ముంబయి చేతిలో ఓడిన సంగతి తెలిసిందే.
చేతులెత్తేసిన హైదరాబాద్ బౌలర్లు
ఎంసిఏ వేదికగా ముంబయితో జరుగుతున్న రంజీట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు నిరాశపరిచారు. దీంతో ముంబయి జట్టు తొలిగా బ్యాటింగ్‌కు దిగి తొలిరోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 457పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా(19) నిరాశపరిచినా.. యశస్వి జైస్వాల్(162) భారీ శతకంతో రాణించారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్(90), కెప్టెన్ అజింక్యా రహానే(139నాటౌట్) కూడా చెలరేగడంతో ముంబయి జట్టు భారీస్కోర్ దిశగా పయనించింది. క్రీజ్‌లో రహానేకి తోడు సర్ఫరాజ్(40) ఉన్నారు. శశాంక్‌కు రెండు, కార్తికేయకు ఒక వికెట్ లభించాయి.