Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విదేశీ లీగ్‌ల్లో ఐపీఎల్ ప్రాంఛైజీలు
కోచి : ఐపీఎల్ ప్రాంఛైజీల యాజమాన్యాల పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 23న కోచిలో ఐపీఎల్ 2023 ఆటగాళ్ల మినీ వేలం జరిగింది. పది జట్ల ప్రాంఛైజీలు వేలంలో పాల్గొన్నాయి. మినీ వేలానికి ముందు ఐపీఎల్ ప్రాంఛైజీల యాజమాన్యాలతో బోర్డు సమావేశమైంది. విదేశీ టీ20 లీగ్‌ల్లో ప్రాంఛైజీలను తీసుకోవటంపై ఈ సమావేశంలో చర్చ జరిగిందని తెలిసింది. ' విదేశీ టీ20ల్లో ఐపీఎల్ ప్రాంఛైజీలు ప్రాతినిథ్యం వహించకుండా ఉండాలనే ఎజెండాతో చర్చ నడిచింది. ఇప్పటికే విదేశీ లీగ్‌ల్లో ప్రాంఛైజీలు కొనుగోలు చేశామని బోర్డుకు తెలిసింది. భవిష్యత్‌లో మళ్లీ ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేందుకు ప్రయత్నించారు' అని సమావేశానికి హాజరైన ఓ జట్టు ప్రతినిధి తెలిపారు. యుఏఈ లీగ్‌లో ముంబయి ఇండియన్స్, కోల్‌కత నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లను కొనుగోలు చేశాయి. దక్షిణాఫ్రికా టీ20లో లీగ్‌లో ఆరు జట్లను చెన్నై సూపర్‌కింగ్స్, ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్‌జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేయటంతో అది కాస్త మినీ ఐపీఎల్‌గా మారింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్‌లు ఇప్పటికే కొనసాగుతున్నాయి. 'విదేశీ లీగ్‌ల్లో జట్ల కోనుగోలుకు బీసీసీఐకి అభ్యంతరం లేదు. కానీ ఐపీఎల్ ప్రాంఛైజీలు అక్కడ జట్లను తీసుకుంటే ఐపీఎల్ విలువ తగ్గిపోతుందనే సూచన చేసేందుకు ప్రయత్నించారని' మరో జట్టు ప్రతినిధి అన్నారు. ఈ అంశంలో బోర్డు జోక్యాన్ని తగ్గించేలా అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. 'ఇతర బోర్డులకు లీగ్‌లు ఆరంభించే హక్కు ఉంది. కానీ గ్లోబల్ లీగ్‌ల్లో ఐపీఎల్ ఎంతో ముందుంది. కొన్ని ప్రాంఛైజీలు ఇప్పటికే ఇతర లీగ్‌ల్లో ఉన్నాయి. ప్రాంఛైజీల దగ్గర డబ్బులు ఉండి, వ్యాపారం చేసుకుంటే బీసీసీఐ ఎందుకు నిలువరిస్తుంది? ఇతర లీగ్‌ల్లో ప్రాతినిథ్యం పూర్తిగా ప్రాంఛైజీల ఇష్టమని' ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ కుమార్ ధుమాల్ పేర్కొన్నారు.