Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అస్సాంతో హైదరాబాద్ ఢీ
- రంజీ ట్రోఫీ మూడో రౌండ్
హైదరాబాద్ : రంజీ ట్రోఫీలో తొలి రెండు మ్యాచుల్లో పేలవ ప్రదర్శన చేసిన హైదరాబాద్.. మూడో మ్యాచ్‌లోనైనా పుంజుకుంటుందా?. ఎలైట్ గ్రూప్-బిలో చివరి స్థానంలో కొనసాగుతున్న హైదరాబాద్ నేడు సొంత గడ్డపై అస్సాంతో తలపడనుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నాణ్యమైన ఆటగాళ్లు లేకపోవటంతో అగ్రశ్రేణి జట్లపై హైదరాబాద్ తేలిపోయింది. ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్‌కింగ్స్‌కు రూ. 20 లక్షలు పలికిన ఆల్‌రౌండర్ భగత్ వర్మను నేడు తుది జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కెప్టెన్ తన్మరు అగర్వాల్ తమిళనాడుపై సెంచరీ సాధించినా.. నాయకత్వ పరంగా తేలిపోయాడు. తుది జట్టు ఎంపిక సహా బౌలర్లను వినియోగించుకోవటంలో తన్మరు తడబడ్డాడు. చివరగా అస్సాంతో 2017 రంజీ సీజన్లో తలపడిన హైదరాబాద్ ఆ మ్యాచ్‌లో గెలుపొందింది. తొలి రెండు మ్యాచుల్లో సౌరాష్ట్ర, ఢిల్లీతో డ్రా చేసుకున్న అస్సాంతో హైదరాబాద్ పైచేయి సాధించగలదా? చూడాలి. నేడు ఉదయం 9.30 గంటల నుంచి మ్యాచ్ ఆరంభం.