Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేథమ్, కాన్వే అర్థ సెంచరీలు
- పాకిస్థాన్‌తో తొలి టెస్టు రెండో రోజు
కరాచీ : న్యూజిలాండ్ ఓపెనర్లు కదం తొక్కారు. టామ్ లేథమ్ (78 బ్యాటింగ్, 126 బంతుల్లో 8 ఫోర్లు), డెవాన్ కాన్వే (82 బ్యాటింగ్, 156 బంతుల్లో 12 ఫోర్లు) అజేయ అర్థ సెంచరీలతో చెలరేగారు. తొలి వికెట్‌కు 47 ఓవర్లలో 165 పరుగులు జోడించిన లేథమ్, కాన్వేలు న్యూజిలాండ్‌కు ధనాధన్ ఆరంభాన్ని అందించారు. నాలుగు ఫోర్లతో 89 బంతుల్లో లేథమ్ అర్థ సెంచరీ బాదగా, డెవాన్ కాన్వే ఆరు ఫోర్లతో 86 బంతుల్లోనే అర్థ శతకం సాధించాడు. ఓపెనర్ల దూకుడుతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 165/0తో మెరుగైన స్థితిలో కొనసాగుతోంది. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌కు 273 పరుగుల వెనుకంజలో నిలిచింది. అంతకుముందు, పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజాం (161), అరంగేట్ర ఆటగాడు ఆగా సల్మాన్ (103) శతకాలకు తోడు సర్ఫరాజ్ అహ్మద్ (86) రాణించటంతో పాకిస్థాన్ 438 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ (3/69), అజాజ్ (2/112), బ్రాస్‌వెల్ (2/72), సోధి (2/87) వికెట్లు పడగొట్టారు.