Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్ర రెండో ఇన్నింగ్స్ 89/1
విజయనగరం :
విజయనగరంలోని చింతలవలస పి వి జి రాజు క్రికెట్ మైదానంలో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో రెండో రోజు ఆంధ్రజట్టుకు 11పరుగుల ఆధిక్యత లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర జట్టు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 89 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోర్ తో 2 వికెట్ల నష్టానికి 58 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 211 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కరణ్ షిండే(52), కెవి శశికాంత్(48) బ్యాటింగ్‌లో రాణించారు. మహారాష్ట్ర బౌలర్లలో ప్రదీప్, సత్యజిత్‌కు మూడేసి, త్రిపాఠి, పాల్కర్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రెండోరోజు ఆట ముగిసే సమయానికి 27ఓవర్లలో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైహ్వాడ్ 51పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.
హైదరాబాద్ 207ఆలౌట్
ఎలైట్ గ్రూప్-బిలో హైదరాబాద్ జట్టు ఆస్సాంపై 2పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యతను సంపాదించింది. తొలి ఇన్నింగ్స్‌లో అస్సాం 205పరుగులు చేయగా.. హైదరాబాద్ జట్టు బుధవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించి 207పరుగులకు ఆలౌటైంది.
రోహిత్ రాయుడు(59), లోయర్ ఆర్డర్ బ్యాటర్ భగత్ వర్మ(46) బ్యాటింగ్‌లో రాణించారు. అస్సాం బౌలర్లలో రియాన్ పరాగ్‌కు నాలుగు, ముక్తార్‌కు మూడు వికెట్లు దక్కాయి.