Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్ : ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ అఫ్ఘనిస్థాన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. స్పిన్ మాయజాలంతో అనతికాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా టీ20ల్లో లీగ్‌ల్లో తనదైన ముద్ర వేసిన రషీద్ ఖాన్ టీ20 ఫార్మాట్లో అఫ్ఘనిస్థాన్ జట్టు సారథ్య పగ్గాలు అందుకున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అఫ్ఘనిస్థాన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్ మహ్మద్ నబి రాజీనామా చేశాడు. దీంతో రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ అఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2021 టీ20 ప్రపంచకప్‌కు రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కానీ జట్టు ఎంపిక ప్రక్రియలో భాగస్వామ్యం చేయలేదనే కారణంతో నాయకత్వ బాధ్యతలు నిరాకరించాడు. జాతీయ జట్టుకు నాయకత్వం వహించటం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని రషీద్ ఖాన్ తెలిపాడు.