Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కష్టాల్లో పడిన పాకిస్థాన్
కరాచీ (పాకిస్థాన్) : టెస్టుల్లో సారథ్యం త్యజించిన అనంతరం తొలి టెస్టులోనే కేన్ విలియమ్సన్ (200 నాటౌట్, 395 బంతుల్లో 21 ఫోర్లు, 1 సిక్స్) ద్వి శతకంతో చెలరేగాడు. పది గంటల పాటు క్రీజులో నిలిచిన కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్‌ను ముందంజలో నిలిపాడు. కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీకి తోడు టెయిలెండర్ ఇశ్ సోధి (65, 180 బంతుల్లో 11 ఫోర్లు) కెరీర్ ఉత్తమ ఇన్నింగ్స్ నమోదు చేయటంతో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 174 పరుగుల విలువైన ఆధిక్యం సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌ను 619/9 వద్ద డిక్లరేషన్ ఇచ్చిన న్యూజిలాండ్.. నాల్గో రోజు చివరి సెషన్లో బంతితోనూ మెరిసింది. మిచెల్ బ్రాస్‌వెల్, ఇశ్ సోధి మెరవటంతో పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. అబ్దుల్లా షఫీక్ (17), షాన్ మసూద్ (10)లు అవుటయ్యారు. ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్ (45 నాటౌట్, 83 బంతుల్లో 5 ఫోర్లు), నమాన్ ఆలీ (4 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు. న్యూజిలాండ్, పాకిస్థాన్ టెస్టులో నేడు చివరి రోజు. ప్రస్తుతం పాకిస్థాన్ మరో 97 పరుగుల వెనుకంజలో నిలిచింది. స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై పాకిస్థాన్ బ్యాటర్లు నిలువగిలిగితేనే కరాచీ టెస్టును కాపాడుకోగలదు. లేదంటే, చివరి రోజు న్యూజిలాండ్ మెరుపు విజయం అన్ని ప్రయత్నాలు చేయనుంది. నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ 31 ఓవర్లలో 77/2తో కొనసాగుతోంది.