Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రోడ్డు ప్రమాదానికి గురై దెహ్రాదూన్‌లో చికిత్స పొందుతున్న టీమ్ఇండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్‌కు చిన్నపాటి ప్లాస్టిక్ సర్జరీ జరిగినట్లు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ తెలిపారు. ముఖం మీద అయిన గాయాలకు దెహ్రాదూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో ఈ సర్జరీ చేసినట్టు పేర్కొన్నారు. తొలుత ఢిల్లీకి ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని భావించినప్పటికీ.. మ్యాక్స్‌లోనే శస్త్రచికిత్సను నిర్వహించారు. ఈ మేరకు శ్యామ్ శర్మ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
బస్సు డ్రైవర్, కండక్టర్‌కు ప్రశంసలు
వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో క్షేమంగా బయటపడడానికి సాయపడిన బస్సు డ్రైవర్ సుశీల్, కండక్టర్ పరమ్ జీత్ కు హర్యానా రోడ్ వేస్ అధికారులు ప్రశంసా పత్రాలు, షీల్డ్‌ను బహూకరించి, వారిని అభినందించారు. మానవత్వానికి వీరు (డ్రైవర్, కండక్టర్) నిదర్శనమని హర్యానా రాష్ట్ర రవాణా మంత్రి మూల్ చంద్ శర్మ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం వీరిని ప్రశంసించింది.