Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రికెటర్‌కు ప్లాస్టిక్ సర్జరీ
డెహ్రాడూన్ : భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఐదుగురు వైద్యుల బృందం రిషబ్ పంత్‌కు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఎడమ కన్ను వద్ద గాయానికి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టు డిడిసీఏ (ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) అధికారులు వెల్లడించారు. శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ అధికారులు పర్యవేక్షిస్తున్నా.. డిడిసీఏ సైతం తమ అధికారులను ఆసుపత్రికి పంపించింది. పంత్ కుటుంబ సభ్యులతో పాటు డిడిసీఏ అధికారులు ఆసుపత్రిలోనే ఉంటున్నారు. ఇదిలా ఉండగా, రోడ్డు ప్రమాదం అనంతరం పంత్‌ను కాపాడిన బస్ డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ పరమ్జీతలను గణతంత్ర దినోత్సవం సందర్భంగా సన్మానించేందుకు ఉత్తరాఖాండ్ ప్రభుత్వం నిశ్చయించింది!.