Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ తొలి ఇన్నింగ్స్ 133 ఆలౌట్
రాజ్కోట్ : సౌరాష్ట్ర కెప్టెన్, స్టార్ పేసర్ జైదేవ్ ఉనద్కత్ దేశవాళీ క్రికెట్లో మరో రికార్డు సాధించాడు. రంజీ ట్రోఫీలో తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు కూల్చిన ఘనత దక్కించుకున్నాడు. రంజీ ట్రోఫీలో ఢిల్లీపై ఉనద్కత్ రెచ్చి పోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి తొలి రెండు ఓవర్లలోనే ఉనద్కత్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వరుస బంతుల్లో (3-5) దృవ్ శోరె (0), వైభవ్ రావల్ (0), యశ్ ధుల్ (0)లను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఆయుశ్ బదాని (0) చిరాగ్ జాని ఓవర్లో నిష్క్రమించగా.. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఉనద్కత్ మళ్లీ రెచ్చి పోయాడు. జాంటీ సిద్ధు (4), లలిత్ యాదవ్ (0) వికెట్లతో ఐదు వికెట్ల ప్రదర్శన పూర్తి చేశాడు. 8/39 గణాం కాలు నమోదు చేసిన ఉనద్కత్ కెరీర్ ఉత్తమ ప్రదర్శన చేశాడు. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్లో 35 ఓవర్లలో 133 పరుగులకు కుప్పకూలింది. టెయిలెండర్లు హృతిక్ (68 నాటౌట్), శివాంక్ (38) రాణించటంతో ఢిల్లీ 100 పరుగుల మార్క్ దాటగలిగింది. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 184/1తో దూసుకెళ్తోంది. ఓపెనర్ హర్విక్ దేశారు (104 నాటౌట్) అజేయ శతకంతో కదం తొక్కాడు. జై గోహిల్ (34), చిరాగ్ జాని (44 నాటౌట్) రాణించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 51 పరుగుల ముందంజలో కొనసాగుతోంది.