Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళల ఐపీఎల్ ఆరంభ సీజన్ ప్రక్రియ మొదలైంది. ఈ ఏడాది మార్చి లో ఆరంభ సీజన్ నిర్వ హణకు ప్రణాళికలు రచించిన బీసీసీఐ.. అందులో భాగంగా కీలక అడుగు వేసింది. మహిళల ఐపీఎల్లో జట్లను కొనుగోలు చేసేందుకు ఇన్విటేషన్ టు టెండరు (ఐటీటీ) విడుదల చేసింది. మహిళల ఐపీఎల్లో జట్ల కొనుగోలు, నిర్వహణకు టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 21 వరకు ఐటీటీ కొనుగోలుకు గడువు నిర్దేశించింది. రూ.5 లక్షల రుసుంతో ఐటీటీ కొనుగోలు చేసి, సమర్పించిన సంస్థల అర్హతలను పరిశీలించి తుది బిడ్లకు అర్హత సాధించిన కంపెనీలను బీసీసీఐ ఎంపిక చేయనుంది. జనవరి నెలాఖర్లో మహిళల ఐపీఎల్ జట్ల వేలం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.