Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిట్నెస్ సాధించిన పేస్ దళపతి
ముంబయి : భారత స్టార్ క్రికెటర్, పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సాధించాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌తో పునరాగమనం చేయను న్నాడు. స్ట్రెస్ఫ్రాక్చర్ గాయంతో నిరుడు సెప్టెంబర్‌లో జట్టుకు దూరమైన బుమ్రా.. మూడు నెలల విరామం అనంతరం జాతీయ జట్టులోకి రానున్నాడు. ' రిహాబిలిటేషన్‌లో ఉన్న బుమ్రా ఫిట్నెస్ సాధించినట్టు ఎన్సీఏ దృవీకరించింది. శ్రీలంకతో వన్డే సిరీస్ జట్టుతో బుమ్రా త్వరలోనే చేరతాడని' బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీలంకతో సిరీస్‌కు జట్లను డిసెంబర్ 27న ప్రకటించారు. ఆ సమయానికి బుమ్రా ఫిట్నెస్ సాధించినా.. ముందు జాగ్రత్తగా బుమ్రా పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. తాజాగా వారం రోజుల పాటు బౌలింగ్ సాధన చేస్తున్న బుమ్రా మ్యాచ్ ఫిట్నెస్ సాధించినట్టు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ప్రకటించింది. జనవరి 10న గువహటిలో భారత్, శ్రీలంక తొలి వన్డేతో బుమ్రా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.