Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ క్యాపిటల్స్ యోచన
న్యూఢిల్లీ : భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్య క్షుడు సౌరవ్ గంగూలీ మళ్లీ ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్లోకి అడుగు పెట్టను న్నాడు. అక్టో బర్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న సౌరవ్ గంగూలీ.. క్రికెట్ పరిపాలనలో రాష్ట్ర స్థాయిలోనూ ఏ పదవి తీసుకోలేదు. గతంలో ఐపీఎల్ ప్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మెంటార్‌గా పని చేసిన గంగూలీని ఆ జట్టు యాజమాన్యం గ్లోబల్ క్రికెట్ డైరెక్టర్‌గా నియమించేందుకు సిద్ద మవుతోంది. ఐపీఎల్‌తో పాటు ఐఎల్టీ20, ఎస్ఏటీ20 లీగ్‌ల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం జట్లను కొనుగోలు చేసింది. మూడు ప్రాంఛ ైజీల క్రికెట్ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతల కోసం గంగూలీనీ క్యాపిటల్స్ యాజమాన్యం సంప్రదించి నట్టు తెలుస్తోంది. 'అవును, ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ గ్రూప్‌తో కలిసి గంగూలీ పని చేయనున్నాడు. అందుకు సంబంధించిన ప్రక్రియ ముగిసింది. గతంలో డిసీ ప్రాంఛైజీతో కలిసి పని చేసిన అనుభవం దాదాకు ఉంది. యాజమా న్యంతో దాదా సౌకర్యంగా ఉన్నాడు. ఐపీఎల్లో ఏ జట్టుతోనైనా గంగూలీ పని చేయాల్సి వస్తే అది ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే' అని ఓ ఐపీఎల్ అధికారి తెలిపారు. స్వీకరించే అవకాశం ఉంది.