Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి ఆటగాడికి రూ.1 కోటి బహుమానం
- హాకీ క్రీడాకారులకు ఒడిశా సీఎం ఆఫర్
భువనేశ్వర్ : 2023 ఎఫ్ఐహెచ్ మెన్స్ హాకీ ప్రపంచకప్ ముంగిట భారత ఆటగాళ్లకు ఒడిశా సీఎం బంపర్ ఆఫర్ ప్రకటించాడు. జనవరి 13 నుంచి ఆరంభం కానున్న ప్రతిష్టాత్మక ఈవెంట్లో భారత్‌కు పసిడి పతకం అందిస్తే జట్టులోకి ప్రతి ఆటగాడికి రూ. 1 కొటి చొప్పున నగదు బహుమానం అందిస్తామని సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించాడు. ప్రపంచకప్‌కు భారత్ 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా ఎంపికవగా, ఒడిశా స్టార్ అమిత్ రోహిదాస్ వైస్ కెప్టెన్సీ దక్కించుకున్నాడు. మెగా ఈవెంట్ కోసం రౌర్కెలాలో ఆధునాతన సౌకర్యాలతో నూతనంగా నిర్మించిన బిర్సా ముండా హాకీ స్టేడియం కాంప్లెక్స్‌ను గురువారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. వరల్డ్‌కప్ విలేజ్ ప్రారంభోత్సవం సందర్భంగా భారత హాకీ క్రీడాకారులతో పట్నాయక్ ఆప్యాయంగా మాట్లాడారు. హాకీ ప్రపంచకప్‌లో విజయం సాధించాలని కాంక్షించిన పట్నాయక్, భారత్ కచ్చితంగా పసిడి నెగ్గుతుందనే విశ్వాసం వెల్లడించారు. జనవరి 13న వరల్డ్‌కప్ ఆరంభ మ్యాచ్‌లో స్పెయిన్‌తో భారత జట్టు తలపడనుంది.