Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్ష్యం 401, ప్రస్తుతం 75/2
- ఆంధ్రతో రంజీ ట్రోఫీ మ్యాచ్
విజయనగరం : ఆంధ్రతో రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బి మ్యాచ్లో కొండంత లక్ష్యం ముందుండగా హైదరాబాద్ ఎదురీదుతోంది. 401 పరుగుల రికార్డు ఛేదనలో హైదరాబాద్ 75/2 వద్ద నిలిచింది. కెప్టెన్ తన్మరు అగర్వాల్ (21, 41 బంతుల్లో 3 ఫోర్లు), ప్రజ్ఞరు రెడ్డి (0)లు వికెట్ చేజార్చుకున్నారు. ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయిన హైదరాబాద్ విజయానికి మరో 326 పరుగుల దూరంలో నిలిచింది. ఆంధ్ర, హైదరాబాద్ రంజీ మ్యాచ్లో నేడు చివరి రోజు. ఆంధ్ర జట్టు విజయానికి 8 వికెట్లు అవసరం కాగా, హైదరాబాద్ 326 పరుగులు చేయాల్సి ఉంది. నేడు హైదరాబాద్ 8 వికెట్లు నిలుపుకుని గెలుపు దిశగా సాగుతుందా? ఒత్తిడికి చిత్తయి వరుసగా రెండో ఓటమి చవిచూస్తుందా? చూడాలి.
అంతకుముందు ఆంధ్ర రెండో ఇన్నింగ్స్లో 462 పరుగుల భారీ స్కోరు సాధించింది. రికీ భురు(116), కరణ్ షిండె (105 నాటౌట్) శతకాలకు తోడు భరత్ (89), జ్ఞానేశ్వర్ (72) రాణించారు.