Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్-శ్రీలంక చివరి టి20 నేడు
- రాత్రి 7.00గం||లనుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
రాజ్‌కోట్: భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడు టి20ల సిరీస్ హోరాహోరీగా సాగుతుంది. తొలి టి20లో టీమిండియా 2 పరుగుల తేడాతో గెలిస్తే.. రెండో టి20లో శ్రీలంక జట్టు 16పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. దీంతో ఇరుజట్ల మధ్య శనివారం జరిగిన మూడో, ఆఖరి టి20లో గెలుపు ఇరుజట్లను ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టైటిల్‌ను గెలుపొందనుండగా.. భారత బ్యాటర్స్ సమిష్టిగా రాణించాల్సిన అవసరమెంతైనా ఉంది. భారత యువ బౌలర్ శివమ్ మావి అరంగేట్రం మ్యాచ్‌లో రాణించినా.. రెండో మ్యాచ్‌లో చేతులెత్తేశాడు. హర్షల్ పటేల్, ఆర్ష్‌దీప్ సింగ్ ఆశించినస్థాయిలో రాణించలేకపోతు న్నారు. పూణే వేదికగా జరిగే రెండో టి20లో శ్రీలంక జట్టు 200కు పైగా పరుగులు చేసి భారత్‌పై ఒత్తిడి పెంచింది. ఈ పిచ్ కూడా బ్యాటర్లకు స్వర్గధామం కాబట్టి బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. ఓపెనర్లు నిరాశపరుస్తుండడం టీమిండియాను కలవరపరుస్తోంది. సీనియర్ల విశ్రాంతితో యువ క్రికెటర్లపైనే టీమిండియా అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు.
జట్లు..
ఇండియా: హార్దిక్(కెప్టెన్), ఇషాన్, సంజు(వికెట్ కీపర్లు), సూర్యకుమార్(వైస్ కెప్టెన్), గైక్వాడ్, శుభ్‌మన్, దీపక్ హుడా, త్రిపాఠి, సుందర్, చాహల్, అక్షర్, ఆర్ష్‌దీప్, హర్షల్, ఉమ్రన్, శివమ్ మావి, ముఖేష్ కుమార్.
శ్రీలంక: శనక(కెప్టెన్), నిస్సంక, అవిష్కా ఫెర్కాండో, సమరవిక్రమ, కుశాల్ మెండీస్, రాజపక్సె, అసలంక, ధనుంజయ, హసరంగ(వైస్ కెప్టెన్), భండార, తీక్షణ, కరుణరత్నే, మధుశనక, రజిత, వెల్లాలగె, మధుశూదన్, కుమార.