Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) ప్రాంఛైజీ, మోటార్‌స్పోర్ట్స్ టీమ్ హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ 2023 సీజన్‌కు ప్రణాళికబద్దంగా సిద్ధమవుతోంది. ఇండియన్ రేసింగ్ లీగ్ తొలి సీజన్ ఓవరాల్ రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్.. 2023 సీజన్‌కు టైటిల్ భాగస్వామిగా ఎంపీ మోటార్‌స్పోర్ట్స్‌లో ఒప్పందం చేసుకుంది. 2023 ఫార్ములా మిడిల్ఈస్ట్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ నాలుగు కార్లతో బరిలోకి దిగుతుండగా.. మూడు కార్లకు ఎంపీ మోటార్‌స్పోర్ట్స్ మద్దతు అందించనుంది. గ్లోబల్ ఫార్ములా రేసు సర్క్యూట్లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ప్రస్థానానికి ఎంపీ మోటార్‌స్పోర్ట్స్ దోహదం చేయగలదని బ్లాక్‌బర్డ్స్ టీమ్ ప్రిన్సిపల్ కార్తీక్ సెల్వరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.